News February 7, 2025

కమర్షియల్ షాపులకు ఆన్‌లైన్ ద్వారా టెండర్ల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC DY.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 24 వరకు అధికారిక వెబ్ సైట్ Tgsrtc.telanagana.gov.in (Tenders)లో టెండర్‌కు దరఖాస్తు చేసుకువాలన్నారు.

Similar News

News February 7, 2025

సంగారెడ్డి: పది విద్యార్థులకు అల్పాహారం నిధులు విడుదల

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం నిధులు విడుదల చేసిందని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున రోజు సాయంత్రం అల్పాహారం అందించేందుకు విద్యార్థికి రూ.15 చొప్పున జిల్లాలో 7,757 మంది విద్యార్థులకు 38 రోజులకు గాను రూ.44,21,490 ను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.

News February 7, 2025

సీఎంతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047- విజన్ డాక్యుమెంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.

News February 7, 2025

గుంటూరు: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(సప్లిమెంటరీ) థియరీ పరీక్షలను ఈనెల 18, 20, 22, 24, 27, మార్చి 1వ తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగ సిబ్బంది తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు. 

error: Content is protected !!