News July 25, 2024

కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ ద్వారా టెండర్ల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్, ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ విధానంలో టెండర్ల ను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం Dy.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు అధికారిక వెబ్ సైట్ https://tender.telangana.gov.in (tender) లో టెండర్ వేయవచ్చని మరిన్ని వివరాలకు , 9963507506 సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 9, 2025

ఖమ్మం: పోలింగ్ సిబ్బంది 3వ దశ ర్యాండమైజేషన్ పూర్తి

image

జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బంది మూడవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామా రావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో మంగళవారం పూర్తి చేశారు. 192 గ్రామ పంచాయతీలు, 1,740 వార్డులకు గాను 1,582 బృందాలను ఏర్పాటు చేసి, 20 మంది సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు. 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఓపీలను మండలాలవారీగా కేంద్రాలకు కేటాయించారు.

News December 9, 2025

ఖమ్మం: రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్ల తో ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ, పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీపై సమీక్ష జరిగింది. రైస్ మిల్లులు అందజేసిన బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

News December 9, 2025

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అలాగే తెలంగాణ గేయాన్ని ఉద్యోగులందరూ ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారిణి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.