News January 31, 2025
కమలాపురంలో రోడ్డు ప్రమాదం

కమలాపురం మండల పరిధిలోని గొల్లపల్లి సమీపాన శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఆయిల్ ట్యాంకర్ యుటర్ను తీసుకొంటుండగా కడప నుంచి ఎర్రగుంట్లకు వెల్లుతున్న బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువతులకు, ఒక యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
కడప జిల్లా హెడ్ క్వార్టర్‌కు ప్రొద్దుటూరు సీఐ..!

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ తిమ్మారెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి అక్కడ రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. బంగారు వ్యాపారి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామిపై డబ్బు ఎగవేత, చీటింగ్, కిడ్నాప్ ఫిర్యాదులున్నాయి. ఈ కేసుల్లో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ తిమ్మారెడ్డి విచారణ చేపట్టారు. విచారణ తీరుపై సీఐపై ఆరోపణలొచ్చి ఆయనను హెడ్ క్వార్టర్‌కి పంపినట్లు సమాచారం.
News November 25, 2025
విజేతలుగా కడప జిల్లా టీంలు

పులివెందులలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్‌లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్‌గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతో గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.