News August 22, 2024
కమలాపురం: అన్న క్యాంటీన్లకు భారీ విరాళం

కమలాపురం నియోజవర్గం వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెకు చెందిన ఎన్వీ నారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో రాజధానికి రూ.5,10,00,116లు విరాళంగా అందించారు. రాజధానిలో భాగస్వామ్యం కావాలనే స్ఫూర్తితో, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌కు చేయూతను ఇవ్వాలనే మంచి ఆలోచనతో, విరాళం ఇచ్చిన ఎన్వీ రమణారెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
Similar News
News November 27, 2025
ఒంటిమిట్ట మండలంలో కుంగిన వంతెన

ఒంటిమిట్ట మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామానికి వెళ్లేందుకు వంకపై వేసిన వంతెన కుంగిపోయింది. ఈ నెలలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఒంటిమిట్ట మండలంలో వంకలు పొంగి పొర్లాయి. చెర్లోపల్లి వంకలో అధిక నీటి ప్రవాహం ప్రవహించడంతో వంతెనకు ఇరువైపులా ఉన్న మట్టి నాని పోయింది. ఈ క్రమంలో ఆ వంతనపై అధిక బరువు ఉన్న ఇసుక టిప్పర్ వెళ్లడంతో ఆ బరువుకు వంతెన కుంగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
News November 27, 2025
కరెంట్ షాక్‌తో కడప జిల్లా యువకుడి మృతి

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 27, 2025
పులివెందులలో జగన్.. విద్యార్థులతో సెల్ఫీ

కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇవాళ తన సొంత నియోజకవర్గంలో రైతులను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. జగన్ దారి మధ్యలో వెళ్తూ ప్రజలతో మమేకమై మాట్లాడుకుంటూ వెళ్లారు. అందులో ఆయనను కలవడానికి స్థానికంగా పిల్లలు వచ్చారు. వారితో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ.. సెల్పీ తీసుకున్నారు. బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.


