News April 28, 2024

కమలాపురం-యర్రగుంట్ల హైవేపై రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

ఖాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్ బాబాఫకృద్దీన్(40) రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బాబాఫకృద్దీన్ యర్రగుంట్ల నుంచి కమలాపురానికి ఆటోలో వస్తుండగా గ్రామచావిడి వద్ద ఆయనకు ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఆటోను పక్కకు ఆపే క్రమంలో రోడ్డు పక్కన గోడకు ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవరు అక్కడిక్కడే మృతి చెందాడు.  

Similar News

News November 13, 2025

19న అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు

image

కడప వైవీయూ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. బద్వేలు బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రీడాకారులు వైవీయూ అనుబంధ కళాశాలల్లో చదివి, 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు అర్హులన్నారు.

News November 13, 2025

కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

image

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం.. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న చిన్న సుంకిరెడ్డికి ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.

News November 13, 2025

కడప జిల్లాలో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై విచారణ!

image

జిల్లాలో 14 అర్బన్ మండలాల్లో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం నాటికి 9,612 ఇళ్ల నిర్మాణాలను ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలించారు. వాటి నిర్మాణాల వివరాలు ఫొటోలతో నమోదు చేశారు. YCP ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.