News September 24, 2024
కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కమలాపురం మండలం పందిళ్ళపల్లె గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలమకూరకు చెందిన కారు, కడపకు చెందిన ఆటో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు కడపకు చెందిన షేక్ అబ్దుల్ హసన్ (23)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 16, 2025
కడపలో రైలు ఢీకొని విద్యార్థి మృతి

కడప రైల్వే స్టేషన్లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని సతీశ్ (24) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సతీశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలో అన్నమాచార్య కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
News November 16, 2025
కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీలు.!

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోరుమామిళ్ల CI శ్రీనివాసులను రైల్వే కోడూరుకు, రైల్వే కోడూరు CI హేమసుందర్ రావును పోరుమామిళ్లకు బదిలీ చేశారు. ఒంటిమిట్ట CI బాబును అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు VRలో ఉన్న నరసింహరాజు ఒంటిమిట్టకు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ CI జావేద్ కడప జిల్లా సైబర్ క్రైమ్ సీఐగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సురేశ్ రెడ్డి రానున్నారు.
News November 16, 2025
రేపు కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్, జాయింట్ అధితి సింగ్తో సహా జిల్లాలోని ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.


