News January 5, 2025

కమలాపురం: వికటించిన RMP డాక్టర్ వైద్యం?

image

ఓ RMP అందించిన వైద్యానికి సుబ్బరాయుడు అనే వ్యక్తి అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఘటన కమలాపురంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. ‘సుబ్బరాయుడు కాలికి గాయం కావడంతో కమలాపురం పట్టణం మార్కెట్లోని RMP వైద్యుని సంప్రదించారు. అతడు అందించిన చికిత్సలకు స్పృహ కోల్పోయాడు. రిమ్స్, ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు అందించగా.. మెరుగైన చికిత్సలు అవసరమని వైద్యులు తెలిపారు’ అని వాపోయారు.

Similar News

News January 26, 2025

కడపలో ఫ్లెక్సీ వార్

image

కడపలో ఫ్లెక్సీ వార్ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల పోరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, ‘21తో గేమ్ ఛేంజర్ అవ్వలేము.. 50 తీసుకోవాలి’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వచ్చిన ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహానికి దారితీసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ‘జై జగన్, జోహార్ వైఎస్సార్’ అంటూ కింద నినాదాలు వేశారు.

News January 26, 2025

కడప డీటీసీ చంద్రశేఖర్‌పై సస్పెన్షన్ వేటు

image

కడప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జిల్లా రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో విచారించిన అధికారులు అతని తప్పు ఉందని తెలియడంతో అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.

News January 26, 2025

కడప: బస్సులో పొగలు.. ఆగిన బస్సు

image

తిరుపతి నుంచి ఆదోని వెళ్తున్న RTC సూపర్ లగ్జరీ బస్సు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వల్లూరు సమీపంలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు వెనుక వైపున పొగ రావడం గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌కు తెలిపారు. టెక్నికల్ సమస్యతో బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే బస్సులో ఎక్కించి పంపించారు. దూర ప్రయాణాలు చేసే బస్సుల కండిషన్ సరిగా లేకపోవడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.