News February 12, 2025
కమలాపూర్‌లో అత్యధికం.. పరకాలలో అత్యల్పం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739335044811_18267524-normal-WIFI.webp)
హన్మకొండ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 129 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం కమలాపూర్ మండలంలో 90 పోలింగ్ కేంద్రాలు, శాయంపేటలో-61, ఆత్మకూరు-50, పరకాల-26, వేలేరు-29, దామెర-36, ఎల్కతుర్తి-59, నడికూడ-47, భీమదేవరపల్లి-69, హసన్‌పర్తి-40 ధర్మసాగర్-65, ఐనవోలు మండలంలో 59 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
Similar News
News February 12, 2025
బాసర ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739364410360_20574997-normal-WIFI.webp)
బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికం తెలంగాణలోని ఏకైక సరస్వతి దేవాలయం బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. వీరితో ఎంపీ గోడం నగేశ్ ఉన్నారు.
News February 12, 2025
సర్కారు బడిలో సార్ బిడ్డ..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739366116351_20560214-normal-WIFI.webp)
సర్కారు బడి బలోపేతం కోసం మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు ఈ టీచర్. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకి చెందిన నర్సింగ్ నరేశ్ పాలకీడు ZPHS తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె నర్సింగ్ నేహాను కీతవారిగూడెం ZPHSలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీచర్ల కాంప్లెక్స్ మీటింగ్ కీతవారిగూడెంలో నిర్వహించగా ఈ విషయం తెలియడంతో HM సువర్ణ, టీచర్లు నరేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
News February 12, 2025
వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720797697-normal-WIFI.webp)
TG: వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి(మ) నాగవరం శివారులో రెండెకరాల్లో టవర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.22 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఐటీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.