News February 12, 2025

కమలాపూర్‌లో అత్యధికం.. పరకాలలో అత్యల్పం

image

హన్మకొండ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 129 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం కమలాపూర్ మండలంలో 90 పోలింగ్ కేంద్రాలు, శాయంపేటలో-61, ఆత్మకూరు-50, పరకాల-26, వేలేరు-29, దామెర-36, ఎల్కతుర్తి-59, నడికూడ-47, భీమదేవరపల్లి-69, హసన్పర్తి-40 ధర్మసాగర్-65, ఐనవోలు మండలంలో 59 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.

Similar News

News March 21, 2025

శివంపేట: హత్యాయత్నం కేసులో ముగ్గురు అరెస్ట్

image

బోరు విషయంలో ఒక కుటుంబంపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు.. తిమ్మాపూర్ గ్రామంలో గత రాత్రి బాలయ్య కుమారులు ప్రసాద్, రాజు అనే వ్యక్తులు దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

News March 21, 2025

దంపతుల హత్య కేసులో పలువురికి శిక్ష:SP 

image

దంపతుల దారుణ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించినట్లు వికారాబాద్ SP నారాయణరెడ్డి తెలిపారు. ధారూర్ PS పరిధిలోని నాగసముందర్ కు చెందిన చిన్న నర్సింహులు, అంజమ్మలను అదే గ్రామానికి చెందిన బంధప్పతో పాటుగా ఆరుగురుతో కలిసి దాడి చేసి చంపారు. ఈ కేసులో పలువురికి జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.

News March 21, 2025

శ్రీకాకుళం: పావురం ఈకపై.. సునీత విలియమ్స్ చిత్రం

image

అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా వచ్చిన భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గౌరవార్థం పావురం ఈకపై ఆమె చిత్రాన్ని గురువారం నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయక్ రూపొందించారు. రాహుల్ గతంలో కూడా పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, కృష్ణుడు, ఆదిత్యుడు మరెన్నో చిత్రాలు గీశారు. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పురస్కారాలు పొందారు.

error: Content is protected !!