News February 7, 2025
కమలాపూర్: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కేజీబీవీ విద్యార్థిని

కమలాపూర్‌లోని కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ పంగిడిపల్లికి చెందిన కౌడగాని సుష్మ SGFI అండర్-19 ఫెన్సింగ్ గేమ్ విభాగంలో ఈనెల 8న పాట్నాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎస్వో అర్చన తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన సుష్మ జాతీయస్థాయి పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతుండటంతో కేజీబీవీ స్టాఫ్, మరికొందరు దాతల సహకారంతో ఆమెకు రూ.30 వేలు ఆర్థిక సాయంగా అందజేసినట్లు అర్చన తెలిపారు.
Similar News
News March 21, 2025
విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు: మంత్రి

విశాఖ ప్రజాప్రతినిధులతో పట్టణాభివృద్ధిశాఖా మంత్రి నారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. వీఎంఆర్డీఏ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
News March 21, 2025
IPL టీమ్స్.. వాటి ఓనర్లు!

*KKR – షారుఖ్, జూహీ చావ్లా, జయ్ మెహ్తా. *MI – ముకేశ్ & నీతా అంబానీ. *CSK – N. శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్. *SRH – కళానిధి మారన్ (సన్ టీవీ). *DC- సజ్జన్ జిందాల్ & పార్థ్ జిందాల్, GMR. *PBKS – ప్రీతి జింతా, మోహిత్ బర్మన్, కరణ్ పాల్. *RCB- యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. *RR- మనోజ్ బడలే, లచ్లన్ ముర్దోచ్. *GT- టొరెంట్ గ్రూప్, CVC క్యాపిటల్ పార్ట్నర్స్. *LSG- సంజీవ్ గోయెంకా, RPSG గ్రూప్.
News March 21, 2025
కాసేపట్లో చెన్నైకి సీఎం రేవంత్ ప్రయాణం

TG: CM రేవంత్ కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నైకి ప్రయాణం కానున్నారు. డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు CM స్టాలిన్ అధ్యక్షతన రేపు అక్కడ జరిగే బీజేపీయేతర దక్షిణాది నేతల భేటీలో ఆయన పాల్గొననున్నారు. ఇదే సభకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హాజరుకానున్న నేపథ్యంలో అక్కడ ఇద్దరు నేతలూ ఒకే స్టాండ్ తీసుకుంటారా లేక విభేదిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.