News March 2, 2025
కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 20, 2025
ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే తెల్లం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివరించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అన్నారు. ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
News November 20, 2025
నౌపడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

సంతబొమ్మాళి మండలం నౌపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం, మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 20, 2025
GNT: జిల్లా గ్రంథాలయ సంస్థలకు జాయింట్ కలెక్టర్లు ఇన్ఛార్జ్లు

రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థల వ్యవహారాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్లను ఇన్ఛార్జ్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం 6 నెలల పాటు లేదా కొత్త ఛైర్మన్ నియామకం వరకు అమల్లో ఉంటుంది. పబ్లిక్ లైబ్రరీస్ చట్టం 1960 ప్రకారం ఈ ఉత్తర్వులను గవర్నర్ ఆమోదించారు.


