News March 2, 2025

కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

image

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్‌కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News February 23, 2026

మక్తల్: ముగిసిన సీఎం కప్ కబడ్డీ పోటీలు

image

మక్తల్‌లో నిర్వహించిన సీఎం కప్ కబడ్డీ పోటీలు సోమవారంతో ముగిశాయి. క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని, విద్యార్థులు చిన్నతనం నుంచే ఆటలపై ఆసక్తి చూపాలని మంత్రి సూచించారు.

News February 23, 2026

ఏలూరు జిల్లాలో టెన్త్ పరీక్షా సమయాలు ఇవే!

image

ఏలూరు జిల్లాలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 133 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, మొత్తం 14,019 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News February 23, 2026

అనంతపురం: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన బి.ఫార్మసీ 3-1, 3-2 (R15, R19, R23) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవడానికి https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.