News March 2, 2025

కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

image

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్‌కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 13, 2025

పాలమూరులో నేడు ‘నెట్ బాల్’ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల బాలికలకు నేడు నెట్ బాల్ ఎంపికలు నిర్వహించనున్నారు. స్థానిక DSA ఇండోర్ స్టేడియంలో ఈ ఎంపికలు జరుగుతాయని జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ మెమో (U-19), బోనఫైడ్, ఆధార్‌ కార్డులతో ఉదయం 9 గంటలలోపు పీడీ జ్యోతికి రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.

News November 13, 2025

నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

image

నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడికి ఇచ్చేందుకు విజయవాడ కోర్ట్ బుధవారం అనుమతి ఇచ్చింది. వారంపాటు కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యగా… కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను 13,14 తేదీల్లో విచారించేందుకు సూర్యారావు పేట పోలీసులు తీసుకెళ్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్లు ఆమెపై కేసు నమోదు అయింది.

News November 13, 2025

వరంగల్ జిల్లాలో చలి పంజా

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలికాలం మొదలైంది. ఉదయాన్నే విపరీతమైన చలితో పాటు మంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా కొనసాగుతోంది. దీంతో రోడ్లపై వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా జాకెట్లు, మఫ్లర్లు ఉపయోగించాలని వైద్యులు సూచించారు.