News March 2, 2025
కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్‌కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 9, 2026
HYD: దట్టమైన మంచు మృత్యువుకు ముసుగు: సీపీ

సంక్రాంతి ప్రయాణాల నేపథ్యంలో ప్రయాణికులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. దట్టమైన పొగమంచు మృత్యువుకు ముసుగులా మారిందని, తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళల్లో వాహనాలతో సాహసం చేయొద్దని హెచ్చరించారు. పొగమంచు తగ్గాకే ప్రయాణం మొదలుపెట్టాలని, డ్రైవింగ్ సమయంలో ఫాగ్ లైట్లు, ఇండికేటర్లు వాడాలని సూచించారు. ‘ఆలస్యంగానైనా సరే.. క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ’ అని ట్వీట్ చేశారు.
News January 9, 2026
డీజీపీ శివధర్‌రెడ్డి నియామకంపై ఇవాళ హైకోర్టు తీర్పు

డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు వెలువరించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. డీజీపీ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ప్రభుత్వం జాబితాను ఆలస్యంగా పంపడంతో యూపీఎస్సీ తిరిగి పంపిందని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది.
News January 9, 2026
WFH చేస్తే అప్రైజల్స్ కట్.. TCS సీరియస్ వార్నింగ్!

ఆఫీస్ నుంచి పని చేయాలనే రూల్ పాటించని వారి పట్ల TCS కఠినంగా వ్యవహరిస్తోంది. వారానికి 5 రోజులు ఆఫీస్‌కు రాని ఉద్యోగుల యాన్యువల్ అప్రైజల్స్‌ను హోల్డ్‌లో పెట్టింది. ముఖ్యంగా ఫ్రెషర్స్ ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే పర్ఫార్మెన్స్ బాండింగ్ ఇవ్వమని కంపెనీ స్పష్టం చేసింది. అటెండెన్స్ తక్కువున్నవారికి ఇప్పటికే మెయిల్స్ పంపింది. ఇకపై ఇంటి నుంచి పని కుదరదని తేల్చి చెప్పింది.


