News May 10, 2024
కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన విశాఖ కలెక్టర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం సందర్శించారు. జిల్లాలోని క్లిష్టతరమైన పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతున్న వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటికే ఎన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్ని చోట్ల ఏర్పాటు చేయాలి అనే విషయమై అధికారులను ఆరా తీశారు.
Similar News
News February 12, 2025
విశాఖలో హత్యకు గురైన MRO భార్యకు ఉద్యోగం

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.
News February 12, 2025
భీమిలి: బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటనపై కేసు నమోదు

లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 12, 2025
రూ.4కోట్లతో సింహాచలం ఆలయ పైకప్పుకు మరమ్మతులు

సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. దేవాలయ కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సున్నం, అరబిక్ చెట్ల జిగురు, బెల్లం, జనపనార మిశ్రమాన్ని వాడి లీకేజీలు నివారిస్తామన్నారు.