News May 4, 2024
కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించిన అధికారులు
అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ అమిత్ బర్దర్‌తో కలసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. కంట్రోల్ సెంటర్‌లో నమోదయ్యే వివరాలను సేకరించారు. సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎదురయ్యే సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 9, 2024
నేడు తరగతులు నిర్వహించరాదు: డీఈవో
శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించరాదని డీఈవో కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 9, 2024
ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి: కలెక్టర్
ఈనెల 11వ తేదీలోపు ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల వెరిఫికేషన్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల ధృవీకరణకు జిల్లాలో ఎక్కువగా పెండింగ్ ఉన్న కంబదూరు, కుందుర్పి మండలాల్లో వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.
News November 8, 2024
ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్
ఏపీలో ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరం లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.