News July 14, 2024

కమిషనరేట్‌లో డ్రగ్స్ కంట్రోల్ టీం: పోలీస్ కమిషనర్

image

మత్తు పదార్థాల నియంత్రణకై WGL పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు WGL పోలీస్ కమిషనర్ వెల్లడించారు. దేశ భవిష్యత్తు అయిన యువతతో పాటు విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా, గంజాయి లాంటి మత్తుపదార్థాల అక్రమ రవాణాతో పాటు విక్రయాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై ఉక్కుపాదాన్ని మోపి తద్వారా కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకై డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటు చేశామన్నారు సీపీ తెలిపారు.

Similar News

News February 24, 2026

వరంగల్ జిల్లాలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో నిర్వహించబోయే ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ పరీక్షా ఏర్పాట్ల వివరాలను తెలిపారు.

News February 21, 2026

తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రానున్న వేసవిలో జిల్లాలోని 698 హ్యాబిటేషన్లలో నివసిస్తున్న 1,16,934 కుటుంబాలకు, నల్లా కనెక్షన్లు లేని 1,784 గృహాలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి వేసవి ప్రణాళికపై సమీక్షించారు.

News February 21, 2026

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ పనులు చేపట్టాలి: కలెక్టర్

image

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయ్‌తో కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రోడ్డు పనుల విషయంలో భూసేకరణ చేపట్టాలన్నారు.