News February 25, 2025
కమీషన్ల కక్కుర్తితో కంపెనీలను తరిమేశారు: స్వామి

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పరిశ్రమల్ని తరిమివేశారని మంత్రి స్వామి శాసన మండలిలో ధ్వజమెత్తారు. మంగళవారం మండలిలో జరిగిన గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంలో వైసీపీ సభ్యుల వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన లూలూ, అమర్ రాజా, ఏషియన్ పార్క్ ఇండస్ట్రీ లాంటి కంపెనీలన్నింటిని తరిమి వేసిన ఘనత జగన్‌దేనని అన్నారు.
Similar News
News October 30, 2025
ప్రకాశం: నేడు కూడా పాఠశాలలకు సెలవు

ప్రకాశం జిల్లాలోని వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా అన్ని పాఠశాలలకు సెలవులు మంజూరు చేస్తూ డీఈవో కిరణ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని డీఈవో తెలిపారు. ఇప్పటికే తుఫాన్ నేపథ్యంలో 3 రోజులపాటు సెలవు ప్రకటించగా.. తాజాగా మరొక రోజును పొడిగించినట్లు, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News October 30, 2025
ప్రకాశం: UG పరీక్షలు వాయిదా

మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు జరగాల్సిన గ్రాడ్యుయేట్ (UG) 3, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటిని తిరిగి నవంబర్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. డీవీఆర్ మూర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News October 29, 2025
ఒంగోలు: హైవేపైకి నీరు.. రాకపోకలకు అంతరాయం

భారీ వర్షాలకు గుండ్లకమ్మ డ్యాం నిండింది. జలాశయానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది. మొత్తం 16 గేట్లు ఉండగా అధికారులు 15 గేట్లు ఎత్తి 1.50లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మద్దిరాలపాడు సమీపంలో హైవే బ్రిడ్జిపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. NDRF సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు మొదలు పెట్టారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.


