News August 8, 2024

కమ్మవారిపల్లిని దత్తత తీసుకొంటా: కురుగొండ్ల సింధు

image

డక్కిలి మండలం కమ్మవారిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సతీమణి సింధు బుధవారం ప్రకటించారు. కమ్మవారిపల్లి గ్రామంలో నిర్వహించిన టీడీపీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ.. తన భర్త కురుగొండ్ల రామకృష్ణ జన్మించిన కమ్మవారిపల్లి (పాతనాలపాడు) గ్రామంలో మౌళిక వసతులు కల్పించడంతో పాటు జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామన్నారు.

Similar News

News September 15, 2024

జాతీయ లోక్ అదాలత్‌లో మూడోసారి నెల్లూరుకు ప్రథమ స్థానం – జిల్లా జడ్జి

image

జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 24,972 కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జి సి.యామిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించిందని లోక్ అదాలత్ కార్యక్రమాలపై నిరంతర దృష్టిపెట్టడంతో నెల్లూరు జిల్లా మూడో సారి రాష్ట్రంలో మొదటి స్థానం దక్కించుకోవడంపై పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 15, 2024

జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరదలు: సోమిరెడ్డి

image

నెల్లూరు మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేరు ఆధునికీకరణకు 2019లో టీడీపీ టెండర్ పిలిస్తే, వైసీపీ విస్మరించిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వరద బాధితులను పరామర్శించేందుకు సైతం జగన్ ఆర్భాటాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎం జగన్‌కు క్యూసెక్, టీఎంసీ, అవుట్ ఫ్లో అంటే అర్థాలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు.

News September 15, 2024

నెల్లూరు: బామ్మర్దిని గొంతు నులిమి చంపిన బావ

image

నెల్లూరు జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు మద్దసాని ప్రకాశం కుమార్తె అమూల్యకు 2017లో వివాహం జరిగింది. శ్రీకాంత్‌ HYD గచ్చిబౌలిలో హాస్టల్‌ నడుపుతున్నాడు. అయితే ఆన్‌లైన్‌ గేమింగ్‌తో పాటు పలు వ్యసనాల వల్ల భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. బామ్మర్ది యశ్వంత్‌ని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందని భావించాడు. తన స్నేహితుడు ఆనంద్‌, వెంకటేశ్‌తో కలిసి యశ్వంత్‌‌ను చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు.