News March 15, 2025
కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలి: పి.నారాయణ బాబు

భూపాలపల్లి జిల్లాలోని ప్రతీ గ్రామం నుంచి డిగ్రీ చదువుకొని ఉచితంగా సేవ చేయాలనే గుణం కలిగిన యువత కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నారాయణ బాబు తెలిపారు. కేసులను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలనే బృహత్తర కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ శ్రీకారం చుట్టిందని వారన్నారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
Similar News
News February 24, 2026
సంతానలేమికి ముందే హెచ్చరికలు

సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయంటున్నారు నిపుణులు. నెలసరి సక్రమంగా రాకపోవడం, ఎక్కువరోజులు బ్లీడింగ్ కావడం, కొందరు 18 ఏళ్లు వచ్చినా అసలు రజస్వలే కాకపోవడం వంటివి గమనించాలి. ఊబకాయం, అవాంఛిత రోమాలు మొలవటం, విడవకుండా మొటిమలు వేధించటం, తీవ్రమైన కడుపునొప్పి వంటివీ ఉండొచ్చు. వీటిని రక్త పరీక్షలు, స్కానింగ్‌తో గుర్తించొచ్చు.
News February 24, 2026
₹130 కోట్ల రివార్డున్న క్రిమినల్ హతం.. ప్రియురాలే కారణం!

మెక్సికోలో రూ.130 కోట్ల రివార్డు ఉన్న డ్రగ్ కార్టెల్ బాస్ ‘ఎల్ మెంచో’ <<19213322>>హతమవడానికి<<>> పరోక్షంగా అతని ప్రియురాలు కారణమయ్యారు. ఆమెను కొన్నిరోజులుగా ట్రాక్ చేసి అతని జాడను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ‘మరుసటి రోజే డ్రగ్ డాన్ స్థావరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అతను అడవిలోకి పారిపోయాడు. వెంటాడి అటాక్ చేయడంతో ఎల్ మెంచో, అనుచరులు గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయారు’ అని వెల్లడించారు.
News February 24, 2026
గుంటూరు ఛానల్ వంతెన నిర్మాణానికి నిధులు

గుంటూరు ఛానల్‌పై వంతెన పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఛానల్లోని 33.300 కి.మీ వద్ద సింగిల్ లేన్ వంతెన నిర్మించనున్నారు. దీని కోసం రూ.94.88 లక్షలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ ఈ మేరకు జీవో-92 విడుదల చేసింది. తగిన సాంకేతిక అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం పనులు ప్రారంభించాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.


