News October 26, 2024

కమ్యూనిస్టులు లేకుండా దేశం లేదు: తమ్మినేని

image

కమ్యూనిస్టులు లేకుండా దేశం లేదని, కష్టాలు, కన్నీళ్లు ఉన్నంత కాలం ఎర్రజెండా ఎక్కడికీ పోదని CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన CPM రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే అని తమ్మినేని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Similar News

News February 28, 2026

మెదక్: మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఘనంగా వీడ్కోలు

image

రెండేళ్ల పాటు మెదక్ కలెక్టర్‌గా పనిచేసి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయిన రాహుల్ రాజ్‌కు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులు, విప్లవాత్మక నిర్ణయాలతో మెదక్ జిల్లాను రాహుల్ రాజ్ రోల్ మోడల్‌గా నిలిపారని కొనియాడారు. పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారని అధికారులు గుర్తు చేసుకున్నారు.

News February 27, 2026

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

News February 27, 2026

మెదక్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

మెదక్ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు. గతంలో తాను అదనపు కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు అందించిన సహకారాన్ని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. అదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.