News April 28, 2024

కరకగూడెం: చెట్టును ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి

image

కరకగూడెం మండలం కలవల నాగారం సమీపంలో ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో మణుగూరు మండలం విజయనగరానికి చెందిన బిజ్జ రమేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 11, 2025

6 వేల మందికి పైగా బైండోవర్ చేశాం: ఖమ్మం సీపీ

image

జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రశాంతంగా వున్న గ్రామాల్లో సమస్య సృష్టించే వ్యక్తులను ముందుస్తుగానే 6 వేల మందికి పైగా బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.

News December 11, 2025

ఖమ్మం జిల్లాలో తొలి సర్పంచి విజయం

image

రఘునాథపాలెం మండలంలో ఓ సర్పంచ్ ఫలితం వెలువడింది. ఈరోజు జరిగిన ఎన్నికలో లచ్చిరాం తండాలో ప్రజలు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మాలోతు సుశీల వైపు మొగ్గు చూపారు. 42 ఓట్ల తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

News December 11, 2025

ఖమ్మం: ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్న ఓటర్లు

image

జిల్లా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. చక్రాల కుర్చీలో వృద్ధులు, చంటిబిడ్డలతో మహిళలు సైతం పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నా, మొత్తంగా చాలా కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది.