News January 30, 2025
కరప: కీచక టీచర్‌ను సస్పెండ్ చేసిన DEO

కరప మండలం వాకాడ మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వడ్లమూరి శ్రీరామారావు ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీనితో బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కీచక టీచర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News December 6, 2025
అనంత: గోడకూలి 8 ఏళ్ల బాలుడి మృతి

డి.హిరేహాల్ మండలం ఎం.హనుమాపురంలో శుక్రవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ కుమారుడు మహేశ్(8) గోడకూలి మీద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 3వ తరగతి చదువుతున్న మహేశ్ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు వెళ్లి తిరిగి వచ్చిన కాసేపటికే ఈ విషాదక ఘటన జరిగింది.
News December 6, 2025
అఖండ-2 వచ్చే ఏడాదేనా?

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుక్ మై షోలో 2026లో రిలీజ్ అని చూపించడంతో ఈ ఏడాది విడుదలకు అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. మరోవైపు క్రిస్మస్కు వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ ’14 రీల్స్’ మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ సంక్రాంతికి వస్తే పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
News December 6, 2025
మద్యం అమ్మకాలు.. ఐదురోజుల్లో రూ.940 కోట్లు

TG: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డులు నమోదు చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు, కొత్త వైన్స్ ప్రారంభం కావడంతో అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 1-5 వరకు డిపో నుంచి ఏకంగా రూ.940 కోట్ల మద్యం లిఫ్ట్ అయ్యింది. DEC 1 నుంచి అమ్మకాలు చూస్తే.. రూ.183.05 కోట్లు, రూ.207.49 కోట్లు, రూ.187.52 కోట్లు, రూ.178.29 కోట్లు, రూ.185.02 కోట్ల బిజినెస్ జరిగింది. బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ము ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.


