News April 15, 2025
కరప: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కరప మండలం నడకుదురుకు చెందిన రావుల శ్రీనివాసరావు (50) లారీ యజమాని. సోమవారం క్లీనర్ రాకపోవడంతో శ్రీనివాసరావు లారీ నడుపుతూ డ్రైవర్ శ్రీనివాస్‌ను పక్కన కూర్చోపెట్టుకున్నారు. లారీ జగన్నాథగిరి కెనాల్ రోడ్డుకి వచ్చేసరికి వేగంతో చెట్టును ఢీకొట్టింది. దీంతో వీరి ఇద్దరు లారీలో ఇరుక్కుపోయారు. స్థానికులు చూడగా అప్పటికే యజమాని మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
Similar News
News April 23, 2025
ఒంగోలులో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్ర దాడిని నిరసిస్తూ ఒంగోలులో వైసీపీ క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మార్కెట్ కాంప్లెక్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
News April 23, 2025
చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళి

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎంతో పాటు ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి, పలువురు కూటమి నాయకులు ఉన్నారు.
News April 23, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ జిల్లాలో టెన్త్ టాపర్స్‌ను అభినందించిన కలెక్టర్ ☞ అమరావతిలో ఉగ్ర దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ ☞ పిడుగురాళ్లలో సందడి చేసిన హీరోయిన్ మెహరీన్ ☞ సత్తనపల్లిలో పోలీసుల తనిఖీలు ☞ నకరికల్లు పోలీస్ స్టేషను తనిఖీ చేసిన ఎస్పీ ☞ పెద్దకూరపాడులో యువకుడిపై దాడి