News October 4, 2024
‘కరవు మండలాల సమగ్ర నివేదికను సమర్పించండి’

శ్రీ సత్యసాయి జిల్లాలో మండలాల వారిగా లోటు వర్షపాతం నమోదైన కారణంగా పూర్తిగా పంటలు వేసుకోలేకపోయిన మండలాల నుంచి ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, వ్యవసాయ అధికారి సుబ్బారావుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేశారు.
Similar News
News December 8, 2025
అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.
News December 8, 2025
అనంత: ఈనెల 10లోపు టెట్.!

అనంతపురంలో ఈనెల 10 నుంచి 21 వరకు TET పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 7 కేంద్రాల్లో సెషన్ వన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్టుల్లో జరుగుతాయని వెల్లడించారు.
News December 8, 2025
అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


