News August 11, 2024
కరాటే పోటీల్లో ప్రతిభ చూపిన పొదిలి విద్యార్థులు

విజయవాడలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి కుంఫూ, కరాటే పోటీల్లో పొదిలి విద్యార్థులు ప్రతిభ కనపర్చారు. కరాటే మాస్టర్ కఠారి చిన్నరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు పలు విభాగాల్లో కట్టాస్, స్పారింగ్లో బంగారు, రజత పతకాలు సాధించారు. స్పారింగ్లో పలు వయస్సుల విభాగాల్లో చిట్టెం షాలూమ్, జోయల్ జశ్వంత్, షేక్ సూఫియా బంగారం పతకాలు సాధించారు. దీంతో విద్యార్థులను పలువురు అభినందించారు.
Similar News
News November 26, 2025
ప్రకాశం: తుఫాన్‌ను లెక్కచేయని వనిత.. అసలు స్టోరీ ఇదే!

నాగులుప్పలపాడు మండలం పోతవరానికి చెందిన మహిళా రైతు వనిత.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2021 నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్న ఆమె అద్భుత విజయాలు సాధించారు. ప్రస్తుతం మొక్కజొన్న, కంది, బీరకాయ పంటలను 2.20 ఎకరాల భూమిలో సాగు చేశారు. మొన్న మొంథా తుఫాన్‌తో మిగిలిన రైతుల పంట దెబ్బతింటే, ఈమె పంట సేఫ్. దీంతో రూ.8500 పెట్టుబడి ఖర్చుకు రూ.53,460 ఆదాయం గడించారు.
News November 26, 2025
నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ: ప్రకాశం కలెక్టర్

ఒంగోలులోని మెప్మా ప్రాజెక్టు పరిధిలో అవినీతి కార్యకలాపాలకు పలువురు సిబ్బంది పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెప్మా ప్రాజెక్టు పరిధిలో జరిగిన అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2 వారాల్లో నివేదికను సమర్పించనుంది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
News November 26, 2025
త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.


