News March 25, 2025
కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో ఇంజినీరింగ్ విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. తాజాగా రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.
Similar News
News November 16, 2025
KNR: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

KNRలోని వావిలాలపల్లిలో శనివారం దివ్యాంగురాలైన అర్చన(15) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్‌కు వెళ్లి వచ్చేసరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు. KNR-3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 16, 2025
‘దమ్ముంటే పట్టుకోండి’ అన్నోడిని పట్టుకున్నారు: సీవీ ఆనంద్

TG: Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని <<18292861>>అరెస్టు <<>>చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. ‘‘జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది. ‘దమ్ముంటే పట్టుకోండి’ అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసింది. DCP కవిత, CP సజ్జనార్‌కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశారు.
News November 16, 2025
పార్వతీపురం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల అహ్వానం

సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ, సాధికారిత అధికారి అప్పన్న శనివారం తెలిపారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి దరఖాస్తును పార్వతీపురంలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయానికి నవంబర్ 25లోగా సమర్పించాలన్నారు.


