News March 25, 2025

కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. తాజాగా రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.

Similar News

News January 9, 2026

నల్గొండ: ‘నో హెల్మెట్-నో పెట్రోల్’.. వ్యాపారులకు ఫుల్ డిమాండ్

image

జిల్లాలో ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధనను పోలీసులు కఠినంగా అమలు చేస్తుండటంతో హెల్మెట్ వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. హెల్మెట్ ఉంటేనే బంకుల్లో ఇంధనం పోయాలని ఎస్పీ కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా హెల్మెట్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News January 9, 2026

TGలో ‘రాజాసాబ్’ బుకింగ్స్ ప్రారంభం

image

తెలంగాణలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈరోజు రాత్రి 11.30 గంటల ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అటు ఏపీలో 9pmకే ప్రీమియర్స్ ప్రారంభం కాగా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

News January 9, 2026

KNR: ‘​యూరియా నిల్వలు పుష్కలం..: ఆందోళన వద్దు’

image

కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత పది రోజుల్లోనే వివిధ సొసైటీల ద్వారా 6,513 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 1,833 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరానికి తగినట్లుగా ఎరువులను తెప్పిస్తున్నామని, రైతులు తమ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.