News February 17, 2025
కరీంనగర్తో కేసీఆర్కు విడదీయరాని బంధం

కరీంనగర్ అంటేనే.. కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటాయి. KCRకు KNR జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేయనున్నట్లు 2001లో KNR గడ్డపైనే ప్రకటించారు. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2018, మే 10న రైతుబంధును ఇక్కడే ప్రారంభించారు. త్వరలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను కరీంనగర్లోనే ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్.
Similar News
News November 1, 2025
చిత్తూరు: 5 కేసుల్లో 9 మందికి ఉరి శిక్ష…!

చిత్తూరు కోర్టులో మొత్తం 5 ఉరి శిక్షలు పడ్డాయి. తాజాగా కటారి కేసులో ఐదుగురికి, 1988లో ఇద్దరిని హత్య చేసిన కేసులో ఒకరికి, 1992 హత్య కేసులో మరొకరికి శిక్ష పడింది. 2020లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఒకరికి, 2023లో మహిళ, ఆమె తల్లిని చంపిన కేసులో విధించారు.
News November 1, 2025
GNT: నేటికి 41ఏళ్లు.. మొదటి లోకాయుక్త మన వారే.!

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వ్యవస్థ 1983 నవంబర్ 1న ఏర్పాటయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ. మొదటి లోకాయుక్తగా అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు నియమితులయ్యారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. కాగా ఆయన మన ఉమ్మడి గుంటూరు జిల్లా మూల్పూరులో జన్మించారు.
News November 1, 2025
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.


