News April 12, 2024

కరీంనగర్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ!

image

కరీంనగర్‌‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మినహా ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 6 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దీంతో కరీంనగర్‌లో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News March 21, 2025

జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్‌లో పడి విద్యార్థి మృతి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 20, 2025

KNR: ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

image

కరీంనగర్ కమిషనర్ పరిధిలోని రూరల్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తనిఖీ చేశారు. డివిజన్ పరిధి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల‌పై ప్రత్యేక దిగా ఏర్పాటు చేయాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలలో అవగాహన పెంచాలని తెలిపారు.

News March 20, 2025

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 38.9°C నమోదు కాగా, జమ్మికుంట 38.7, చిగురుమామిడి 38.2, శంకరపట్నం 38.0, కరీంనగర్ రూరల్ 37.9, గన్నేరువరం 37.7, మానకొండూర్ 37.6, తిమ్మాపూర్ 37.3, వీణవంక 37.2, రామడుగు 37.0, కరీంనగర్ 36.7, కొత్తపల్లి 36.0, హుజూరాబాద్ 35.5, ఇల్లందకుంట 35.4, చొప్పదండి 35.0, సైదాపూర్ 34.6°C గా నమోదైంది.

error: Content is protected !!