News February 14, 2026

కరీంనగర్‌లో చతికిలపడ్డ ‘కారు’.. పట్టు కోల్పోయిన ‘పతంగి’

image

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత పాలకవర్గంలో 33 స్థానాలతో ఆధిపత్యం చలాయించిన బీఆర్ఎస్, ఈసారి కేవలం 9 సీట్లకే పరిమితమై భంగపడింది. హేమాహేమీలు ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. మరోవైపు, ఎంఐఎం సైతం తన పాత స్థానాలను నిలబెట్టుకోలేక కేవలం 3 చోట్ల మాత్రమే గెలిచి చతికిలపడింది.

Similar News

News March 13, 2026

సీఎం ను కదిలించిన ఏలూరు కలెక్టర్

image

పాపికొండల అభయారణ్య పరిధిలోని గిరిజన గ్రామాల్లో బోరుబావులు, రహదారుల నిర్మాణానికి అటవీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ వెట్రిసెల్వి సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. స్పందించిన సీఎం గిరిజనులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అటవీ అధికారులు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో గిరిజనులకు మౌలిక సదుపాయాలు అందేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.

News March 13, 2026

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత.. JC క్లారిటీ

image

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గృహ వినియోగానికి సరిపడా LPG సిలిండర్లు నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు.

News March 13, 2026

మూడో రోజూ బ్లడ్‌బాత్.. భారీ నష్టాలు

image

యుద్ధ భయాలు, గ్యాస్ కొరత నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఏకంగా 488(2.06) పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద, సెన్సెక్స్ 1,470(1.93) పాయింట్లు నష్టపోయి 74,563 వద్ద ముగిశాయి. నిఫ్టీ మూడు రోజుల్లో సుమారు 1,100 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. L&T(7.38%), టాటా స్టీల్(5.3%), ఎస్బీఐ(3.7%), బెల్(3%), మారుతి(3%) షేర్లు భారీగా నష్టపోయాయి.