News June 4, 2024
కరీంనగర్లో దూసుకుపోతున్న “బండి”
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రతి రౌండ్లో ఆధిక్యతను కనబరుస్తూ దూసుకుపోతున్నారు. 11వ రౌండ్ ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 1,25,575 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీకి 3,02,198 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 1,76,623 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 1,44,541 ఓట్లు వచ్చాయి.
Similar News
News November 2, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ రామడుగు మండలంలో కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బాలికపై వీధి కుక్క దాడి. @ కోరుట్ల లో గంగమ్మ ఆలయంలో చోరీ. @ జగిత్యాలలో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. @ కరీంనగర్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన బీసీ కమిషన్ సభ్యులు@ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్న సిరిసిల్ల కలెక్టర్@ జగిత్యాలలో షార్ట్ సర్క్యూట్ తో బట్టల షాపు దగ్ధం
News November 2, 2024
కరీంనగర్: బీసీ కమిషన్‌కు 213 విజ్ఞప్తులు
కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో శుక్రవారం బీసీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 213 విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో కరీంనగర్ జిల్లా నుంచి 99 విజ్ఞప్తులు రాగా జగిత్యాల జిల్లా నుంచి 29, పెద్దపల్లి జిల్లా నుంచి 32, రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి 53 విజ్ఞప్తులు వచ్చాయి. సుమారు 9 గంటల పాటు బీసీ కమిషన్ సభ్యులు విజ్ఞప్తులను స్వీకరించారు.
News November 1, 2024
కథలాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డిఎస్పీ
కథలాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా.. డిఎస్పీ ఉమామహేశ్వరరావు స్టేషన్‌లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నెలల వారీగా నమోదైన కేసులు, వాటి పరిష్కారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కోరుట్ల సీఐ సురేష్‌బాబు, ఎస్ఐ నవీన్ కుమార్ ఉన్నారు.