News November 26, 2024

కరీంనగర్‌లో పెరిగిన చలి.. జాగ్రత్త!❄

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 4 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు‌ ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త! SHARE IT

Similar News

News October 15, 2025

KNR: గుండెపోటు.. ఆ క్షణాలు చాలా కీలకం

image

గుండెపోటు సమయంలో అవలంబించవలసిన CPR(కార్డియో పల్మనరీ రెసీసీకేషన్) పద్ధతిపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు CPR అవగాహన వారోత్సవాల సందర్భంగా KNR ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ నిర్వహిస్తున్నారు. బుధవారం కలెక్టర్ హాజరై మాట్లాడారు. గుండెపోటు సంభవించిన సమయంలో మొదటి కొన్ని గోల్డెన్ సెకండ్లు వృథా చేయవద్దన్నారు.

News October 15, 2025

కరీంనగర్: ‘న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి’

image

KNR కలెక్టరేట్ ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్‌పై బూటు విసిరిన ఘటనకు నిరసనగా అంబేద్కర్ వాదులు దీక్ష చేపట్టారు. తలారి సుధాకర్, కునమల్ల చంద్రయ్య సహా పలువురు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీం కోర్టులో రాకేశ్ కిషోర్ చేసిన ఈ చర్యను వారు తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

News October 15, 2025

ఆర్డీవో నివేదిక జాప్యంపై కరీంనగర్ కలెక్టర్‌కు ఫిర్యాదు

image

135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణిలో ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ చేస్తున్నాడని వీఆర్ఏపై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్ ఆర్‌డిఓను 15రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్‌డీఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12న విచారణ పూర్తి చేసిన తుది నివేదిక అందించలేదని వాపోయాడు.