News April 19, 2024

కరీంనగర్‌లో బండి సంజయ్ నామినేషన్

image

కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ తరఫున స్థానిక బీజేపీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరెట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి అందజేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మేయర్ శంకర్ తదితరులు ఉన్నారు. కాగా కరీంనగర్‌లో బీజేపీ విజయం ఖాయమని ట్విట్టర్‌లో బండి సంజయ్ పోస్ట్ చేశారు.

Similar News

News November 12, 2025

కరీంనగర్: ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకు, కొడలుపై ఫిర్యాదు

image

ఆస్తి కోసం తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని ఆస్తి కాజేయాలని తన కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారని HZB ఆర్డీఓకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. జమ్మికుంటకు చెందిన గుల్లి లక్ష్మీ-మొగిలిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు చెప్పారు. పెద్ద కొడుకు, కోడలు సంపత్-స్వరూప తెల్ల కాగితం మీద సంతకాలు చేయించుకుని ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

News November 12, 2025

కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా అశ్విని తానాజీ వాంఖడే

image

కరీంనగర్ జిల్లా నూతన విద్యాధికారిగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అశ్విని తానాజీ వాంఖడేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకే ఉన్న జిల్లా విద్యాధికారి చైతన్య జైనిని ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె విద్యాధికారిగా కొనసాగనున్నారు.

News November 12, 2025

కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమీషనర్ HYD ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2025- 26 సంవత్సరానికి చెందిన 9వ,10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి తెలిపారు. www.tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రూ.4 వేలు మంజూరు అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.