News February 6, 2025
కరీంనగర్లో రేపు జాబ్ మేళా..!

కరీంనగర్లోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(ఆటానమస్)లో శుక్రవారం జాబ్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ ప్రొ.డీ.వరలక్ష్మీ తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుందని.. ఈ అవకాశాన్ని స్థానికంగా ఉండే ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాబ్ డ్రైవ్లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూకి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్ను వెంట తెచ్చుకోవాలన్నారు.
Similar News
News November 26, 2025
ప్రీ డయాబెటీస్ని ఎలా గుర్తించాలంటే?

ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ రావడానికి ముందు స్టేజి. వీరిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సినదాని కన్నా కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ స్టేజిలో జాగ్రత్తలు తీసుకోకపోతే డయాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి మందులు ఇవ్వకుండా ముందు డైట్ పాటించాలని, వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.
News November 26, 2025
బెండ, టమాటా, వంగలో వైరస్ తెగుళ్ల నివారణ

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.
News November 26, 2025
MBNR: పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలపై ముఖ్యమైన బాధ్యతలు కూడా ఉంచిందని, పోలీసు శాఖ ప్రజల హక్కులను కాపాడుతూ, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.


