News February 18, 2025
కరీంనగర్‌లో విషాద ఘటన

కరీంనగర్‌లో విషాద ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్యాల మండలం నూకపల్లి వాసి చెవులమద్ది స్రవంతి(29) 8నెలల గర్భిణి. ఆదివారం చెకప్‌కు జగిత్యాలకు వెళ్లగా హార్ట్, ఉమ్మనీరు ప్రాబ్లమ్ ఉందని HYDకి వెళ్లాలని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను KNRకు తరలించి, చికిత్స అందించినప్పటికీ లోపల బిడ్డ మృతిచెందాడు. వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించి స్రవంతి కూడా మరణించింది.
Similar News
News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న మృతుడి బంధువులు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: KNR మున్సిపల్ ప్రత్యేక అధికారి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనా నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
News March 28, 2025
కరీంనగర్ DRDOకు ‘స్త్రీనిధి’లో రాష్ట్ర స్థాయి అవార్డు

స్త్రీనిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 115 శాతం రుణ పంపిణీ, 90 శాతం రికవరీ చేసినందుకు గాను DRDO కు అవార్డు వచ్చింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అదనపు DRDO సునీత అవార్డు అందుకున్నారు. కరీంనగర్ DRDO అవార్డ్ అందుకోవడం పట్ల కలెక్టర్ పమేలా సత్పతి డిఆర్డిఓను, సిబ్బందిని అభినందించారు. పేద మహిళలకు స్త్రీనిధి ద్వారా మరిన్ని సేవలు అందించాలని అన్నారు.