News February 14, 2026
కరీంనగర్‌లో ‘హస్తం’ విలవిల..!

కరీంనగర్ పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైంది. అభ్యర్థుల ఎంపికలో జాప్యం, వర్గపోరు పార్టీ అవకాశాలను దెబ్బతీశాయి. క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం, బీజేపీ దూకుడును అడ్డుకోవడంలో వైఫల్యం ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం, బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడంతో ఓటర్లు ముఖం చాటేశారు. వెరసి, నగరపాలక పీఠంపై ఆశలు ఆవిరయ్యాయి.
Similar News
News March 6, 2026
పార్వతీపురం: ‘15 లోగా CSC పనులను పూర్తి చేయాలి’

జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC) పనులను కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రతి CSC పని పూర్తి కావడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
News March 6, 2026
నిర్మల్: పరీక్షలకు 143 మంది గైర్హాజరు

జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం-2, జంతుశాస్త్రం-2, చరిత్ర-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 5677 మంది విద్యార్థులకు గాను 5534 మంది హాజరు కాగా, 143 మంది గైర్హాజరయ్యారు. దిలావర్‌పూర్, కుంటల, నిర్మల్ బాలుర జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆయన పేర్కొన్నారు.
News March 6, 2026
కొత్తపట్నంలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక SI వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని SI తెలిపారు.


