News October 16, 2024
కరీంనగర్ అనే పేరు ఎలా వచ్చింది?
నేడు కరీంనగర్ అని పిలవబడే పేరు సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణం చేయబడింది. పూర్వం ఈ ప్రాంతానికి ‘సబ్బినాడు’ అని పేరు. KNR, శ్రీశైలంలలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల, ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరినగరం.. కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున కరినగరం, క్రమంగా కరీంనగర్‌గా మారింది. మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, సుప్రసిద్ధ కవులను తయారు చేసిన గడ్డ ఇది.
Similar News
News November 5, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.2,49,322 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,39,134, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.76,550, అన్నదానం రూ.33,638,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
News November 5, 2024
KNR: ఉమ్మడి జిల్లా ధాన్యం కొనుగోళ్ల పరిశీలన ప్రత్యేక అధికారిగా RV కర్ణన్
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్ వి కర్ణన్ నియమితులయ్యారు. జగిత్యాల, పెద్దపెల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. రేపటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించనున్నారు.
News November 4, 2024
రాజన్నను దర్శించుకున్న 76,329 మంది భక్తులు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాస మొదటి సోమవారం పురస్కరించుకొని 76,329 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కే.వినోద్ రెడ్డి తెలిపారు. అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.