News February 14, 2025
కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

పొన్నం ప్రభాకర్పై పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
Similar News
News November 21, 2025
కడపలో నేడు వాహనాల వేలం

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.
News November 21, 2025
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 33 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ సిటీలో గురువారం జరిగిన దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. OCT 11న సీజ్ఫైర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి Israel దాడుల్లో కనీసం 211 మంది చనిపోయారని, 597 మంది గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల ఎలాంటి మార్పూ రాలేదని, దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పాలస్తీనియన్లు ఆవేదన చెందుతున్నారు.
News November 21, 2025
గద్వాల జిల్లాలో మహిళా ఓటర్లే ఆధిక్యం

గద్వాల జిల్లాలో మొత్తంలో 255 జీపీలలో 2,390 వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డుకు ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సెప్టెంబర్లో జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లా మొత్తం ఓటర్లు 3,99,418 మంది ఉండగా అందులో పురుషులు 1,93,637, మహిళలు 1,99,781 ఉన్నారు. 6154 మహిళ ఓటర్లు ఆధిక్యంలో ఉన్నారు. ఈనెల 21 నుంచి 23 వరకు మరోసారి మార్పులకు, చేర్పులకు అవకాశం కల్పించి ఫైనల్ చేయనున్నారు.


