News February 21, 2025

కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం వెబ్‌సైట్!

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. కరీంనగర్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.

Similar News

News February 22, 2025

కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్ (2/2)

image

✓ కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ కు ఏం తెచ్చడో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
✓ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
✓ చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు
✓ ఇల్లందకుంట: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టిన తెలంగాణ ఉద్యమకారులు
✓ చిగురుమామిడి: యూరియాపై వస్తున్న వదంతులు నమ్మొద్దు: మండలం వ్యవసాయ అధికారి రాజుల నాయకుడు
✓ మొలంగూర్ లో క్షయ వ్యాధి నివారణ మొబైల్ క్యాంప్

News February 22, 2025

KNR: రంజాన్ మాసం సందర్భంగా అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

image

వచ్చే నెల 2 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలోని మసీదులు, ఈద్గాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం ఏర్పాట్లపై ముస్లిం మతపెద్దలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

News February 22, 2025

చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు

image

చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. జూనియర్లపై దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలుంటాయని స్కూల్ డైరెక్టర్ కేసీ రావు తెలిపారు. విషయాన్ని గోరంతను కొండంతలు చేశారని, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న స్కూల్‌ను బదనాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులు ఎన్నో మెడల్స్ సాధించారని తెలిపారు. 

error: Content is protected !!