News August 21, 2024

కరీంనగర్: ఇళ్లు లేని పేదలకు శుభవార్త!

image

రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదల నుంచి 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు వారికి ఆర్థిక సహాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఇటీవల ప్రభుత్వం తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పథకానికి మొత్తంగా 7,09,923 దరఖాస్తులు రాగా.. మొదటి విడతలో 42 వేల ఇళ్లకు నిధులు రానున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 19, 2025

KNR: ‘పాఠశాలల్లో విభిన్న పద్ధతుల్లో విద్యాబోధన’

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) జిల్లాస్థాయి మేళాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విభిన్న పద్ధతులను అనుసరించి విద్యాబోధన చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులున్నారు.

News September 19, 2025

కరీంనగర్: చెత్త వేయకుండా ఇనుప జాలి ఏర్పాటు

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

News September 19, 2025

శంకరపట్నం: యాదవ్ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా ఐలయ్య యాదవ్

image

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గుండెవేని ఐలయ్య యాదవ్‌ను యాదవ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాష్ట్ర యాదవ చైతన్య వేదిక అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ తెలిపారు. శంకరపట్నం మండల కేంద్రంలో ఈ నియమకం జరిగినట్లు చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.