News February 18, 2025

కరీంనగర్: ఈనెల 25 నుంచి ఫార్మసీ పరీక్షలు

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) ఏడు, ఎనిమిది సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఎన్‌వీ.శ్రీరంగ ప్రసాద్ తెలియజేశారు. ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవనున్నట్లు వెల్లడించారు. 

Similar News

News November 25, 2025

సూర్యాపేట: నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే!

image

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నూతనకల్ మండలం పెదనెమిల జీపీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెదనెమిల జీపీలోని 1వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ఓటరు ఒక్కరే ఉండటం విశేషం. నామినేషన్ వేసే ప్రక్రియ పూర్తయితే, వార్డు మెంబర్ ఏకగ్రీవం కానుంది.

News November 25, 2025

తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్

image

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఫైల్స్ వేగంగా ముందుకు కదులుతున్నాయి. సంబంధిత అలైన్‌మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి SCR పంపింది. ముందుగా గూడూరు స్టాఫింగ్ అనుకునప్పటికీ తిరుపతిలో స్టాఫింగ్ ఉండేలా ప్లాన్ చేయాలని TN ప్రభుత్వం కోరింది. త్వరలోనే ఈ DPR పూర్తి కానుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 12గంటలుండగా బుల్లెట్ ట్రైన్‌లో కేవలం 2.20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో 11.6KM సొరంగం ఉంటుంది.

News November 25, 2025

ప్రారంభమైన ఆట.. బౌలర్లే దిక్కు

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో SA 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ జట్టు 314 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. SAను త్వరగా ఆలౌట్ చేయకుంటే ఇండియా ముందు కొండంత లక్ష్యం పేరుకుపోవడం ఖాయం. బౌలర్లు ఏం చేస్తారో చూడాలి మరి.