News August 9, 2024
కరీంనగర్: ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ ఓపెన్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 8 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. అడ్మిషన్ ఫీజును అందుబాటులో ఉన్న ఓపెన్ స్కూల్ కేంద్రాలలో ఆన్లైన్లో అడ్మిషన్ ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందాలని కోరారు.
Similar News
News September 15, 2024
గణేష్ నిమర్జనం ఉత్సవానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ అఖిల్ మహదేవ్
గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని.. భక్తులు, మండపాల నిర్వహకులు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం సాయంత్రం సిరిసిల్ల పట్టణ పరిధిలోని బివై నగర్, జేపీ నగర్, పద్మనగర్, సిక్ వాడ, సంజీవయ్య నగర్ మొదలగు ప్రాంతల్లో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలని పరిశీలించారు.
News September 15, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,90,723 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,71,772, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.57,700, అన్నదానం రూ.61,251 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
News September 15, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పూజలందుకుంటున్న గణనాథులు.
@ తంగళ్లపల్లి మండలంలో పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో తేలుకాటుతో వ్యక్తి మృతి.
@ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో విష జ్వరంతో బాలిక మృతి.
@ అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న సిరిసిల్ల కలెక్టర్.