News February 16, 2025
కరీంనగర్: ఈ నెల 18 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

బీసీ స్టడీ సర్కిల్ లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతాయని KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థుల కోరిక మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి 18న ఉదయం 10 గంటలకు క్లాసులకు హాజరు కావాలని కోరారు.
Similar News
News October 23, 2025
మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

TG: వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జరిగే <<17462157>>మేడారం<<>> జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే ప్రదేశాన్ని 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించనున్నట్లు అధికారులు తెలిపారు. 1,050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా 24 శాశ్వత, 20 తాత్కాలిక మొబైల్ టవర్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. 12 వేల మంది పోలీసులు జాతరలో విధులు నిర్వహిస్తారని సమాచారం.
News October 23, 2025
సిద్దిపేట: నేటి కేబినెట్ భేటీపై ఆశావహుల ఆశలు

నేడు జరుగనున్న కేబినెట్ భేటీపై ఆశావహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. నోటిఫికేషన్ వెలువరించటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి విడుదల చేయాలని కోరుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే యువతకు రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వయసు, బాధ్యతలు పెరిగి రాజకీయాలు చేయలేమని అంటున్నారు.
News October 23, 2025
ధర్మపురి: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ధర్మపురి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతి సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు MCA/ M.Sc కంప్యూటర్ సైన్స్లో 55% మార్కులు ఉన్నవారు Ph.D/ NET/ SET అర్హతగల అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో ఈనెల 24 శుక్రవారం రోజున నేరుగా కళాశాలలో హాజరుకావాలని ప్రిన్సిపల్ రాధ కిషన్ ఒక ప్రకటన ద్వారా కోరారు.