News April 7, 2025

కరీంనగర్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు. డిగ్రీ చదివి బీసీ-ఏ, బీ, డీకి చెందిన అభ్యర్థులు ఈనెల 8లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 0878-2268686 నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News April 20, 2025

సిర్పూర్ (యు): అనాథలుగా మారిన చిన్నారులు

image

ఇద్దరు చిన్నారుల జీవితాలను విధి అంధకారంలోకి నెట్టింది. తల్లిదండ్రులను తీసుకెళ్లి అనాథలుగా మార్చింది. రాగాపూర్‌కి చెందిన సోయం హన్మంతు 2 రోజుల క్రితం వడ దెబ్బతో మృతి చెందగా అతడి భార్య లక్ష్మీ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో వారి కుమార్తె జంగుబాయి(10), కుమారుడు చంద్రబాన్ (9) అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న NHRC సభ్యులు శనివారం వారి ఇంటికి వెళ్లి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

News April 20, 2025

బంటుమిల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

image

బంటుమిల్లి మండలం నారాయణపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన వాసాబత్తిన వీరాచారి (29) ,అనకాపల్లి ప్రసాద్ (28) రాజమండ్రి నుంచి బైక్ పై మచిలీపట్నం వస్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఇరువురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

News April 20, 2025

BIG BREAKING: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ చేసుకోవాల్సిన సైట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

error: Content is protected !!