News April 11, 2024

కరీంనగర్: ఉద్యోగులూ.. జర జాగ్రత్త!

image

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఎన్నికల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో 106 మంది ఈజీఎస్, ఐకెపీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కావున జిల్లాలోని ఉద్యోగులు పార్టీలపై పక్షపాతం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Similar News

News November 28, 2025

రంగాపూర్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి రమేష్ అనే వ్యక్తి మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News November 27, 2025

కరీంనగర్‌లో తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. గంగాధరలో అత్యధికంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. చొప్పదండిలో 15, కొత్తపల్లిలో 12, కరీంనగర్ రూరల్‌లో 10, రామడుగులో 27 నామినేషన్లు నమోదయ్యాయి. 866 వార్డులకు గాను, తొలి రోజు 86 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు.