News April 11, 2024
కరీంనగర్: ఉద్యోగులూ.. జర జాగ్రత్త!

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఎన్నికల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో 106 మంది ఈజీఎస్, ఐకెపీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కావున జిల్లాలోని ఉద్యోగులు పార్టీలపై పక్షపాతం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
Similar News
News March 18, 2025
KNR: టీబీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

టీబీ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉన్న వారంతా TBపరీక్ష చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ TBనిర్మూలన కార్యక్రమంలో భాగంగా మెట్రోసెమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన TB వ్యాధిగ్రస్థులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి టీబీ తొందరగా వ్యాపిస్తుందని, అందువల్ల సమతుల పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
News March 18, 2025
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ -2 ఉద్యోగానికి మొలంగూర్ వాసి ఎంపిక

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన చల్లూరి రాజకుమార్ ఇటీవల వెలువడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ -2 ఫలితాల్లో మంచిమార్కులు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. చల్లూరి సాయిలు, కేతమ్మల కుమారుడైన రాజకుమార్.. ఇన్నాళ్లు ఎంతో కష్టపడి చదివి తన కళ నెరవేర్చుకున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు రాజకుమార్‌కు అభినందనలు తెలిపారు.
News March 18, 2025
చొప్పదండి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపిక

చొప్పదండికి చెందిన మంచికట్ల కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాగా కుమార్ తండ్రి మంచికట్ల విట్టల్.. ఫుట్‌వేర్ షాప్ నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కుమార్ మాట్లాడుతూ.. తన తండ్రి కష్టపడి చదివించారని, తన ఆశయాలను వమ్ము చేయకుండా కృషి, పట్టుదలతో చదివానని ఈసందర్భంగా పేర్కొన్నాడు. కుమార్‌ను పద్మశాలి సంఘం అధ్యక్షుడు దండే రాజయ్య, దండే లింగన్న, దూసరాము అభినందించారు.