News February 11, 2025

కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.

Similar News

News December 5, 2025

కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

image

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.

News December 5, 2025

మంచిర్యాల: సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్

image

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. సర్పంచ్‌గా తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె గ్రామ ప్రజలను కోరారు. ఆమె నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

News December 5, 2025

తిరుమలలో ఇద్దరు అరెస్ట్

image

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పేరిట ఫేక్ లెటర్లు సృష్టించారు. వీటి ద్వారా హైదరాబాద్ భక్తులను దర్శనానికి పంపారు. పోలీసులు నిఘా పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు నాయుడుపేటకు చెందిన ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీగా గుర్తించారు.