News February 11, 2025
కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.
Similar News
News March 16, 2025
నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్‌పూర్లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.
News March 16, 2025
రాజంపేట: అందుబాటులోకి ఇంటర్ సిటీ ట్రైన్

తిరుపతి-హుబ్లీ ఇంటర్ సిటీ ట్రైన్ ఆదివారం నుంచి తిరిగి అందుబాటులోకి వచ్చింది. 57401, 57402 నంబర్లతో తిరుపతి, హుబ్లీ మధ్య తిరిగే ఈ రైలును రద్దుచేసి, కుంభమేళాకు మళ్లించారు. దీంతో ఎర్రగుంట్ల, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు ప్రాంత ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. తాజాగా ఈ రైలు అందుబాటులోకి రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News March 16, 2025
BNGR: మండలానికి మరో రెండు రైతు నేస్తం కేంద్రాలు!

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రైతు నేస్తం కేంద్రాలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి NLG జిల్లాలో 315 రైతు వేదికల్లో 77 రైతు నేస్తం కేంద్రాలని నిర్వహిస్తోంది. మండలానికి మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రతినెల నిధులు మంజూరు చేసి రైతులకు మరింత పరిజ్ఞానం అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.