News March 6, 2025
కరీంనగర్: ఎక్కడి సమస్యలు అక్కడే..!

గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటింది. అప్పటినుంచి కరీంనగర్ జిల్లాలోని 318 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 15, 2025
జమ్మికుంట: రైలుకింద పడి వ్యక్తి మృతి

జమ్మికుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతిచెందాడు. రైలు ఎక్కుతుండగా కొమురయ్య (50) జారిపడి చనిపోయాడు. మృతుడు రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి.
News March 15, 2025
జమ్మికుంట: రైల్వేపట్టాలపై యువతి, యువకుడి మృతదేహాలు

జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్- పాపయ్యపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాల పక్కన యువతీ, యువకుడి మృతదేహాలు కలకలం రేపాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రేమజంటగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాల వద్ద పంచనామా నిర్వహించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది.
News March 15, 2025
KNR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన: KTR

కాంగ్రెస్ ప్రజాపాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన అని కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంపద సృష్టిస్తాం , ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికిన నాయకులు.. సగటున నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది అని అన్నారు.